మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ స్థలంలో అక్రమ నిర్మాణం

by sudharani |   ( Updated:2023-05-22 07:49:48.0  )
మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ స్థలంలో అక్రమ నిర్మాణం
X

దిశ, చండూరు: మున్సిపాలిటీలో గత కొంతకాలంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఇప్పుడు ఏకంగా వాణిజ్య భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో కొందరు చిరు వ్యాపారులు ఆదివారం రాత్రికి రాత్రే డబ్బాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడానికి ప్రభుత్వం టీయుఎఫ్ ఐడీసీ నిధుల నుండి 50 లక్షల రూపాయలు మంజూరు చేయగా.. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జనవరి నెలలో శంకుస్థాపన చేశారు.

శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడంతో నిర్మాణం రద్దు అయ్యిందేమోనని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్థలాన్ని పరిశీలించిన మరుసటిరోజే కొందరు చిరు వ్యాపారులు డబ్బాలు ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనుల అక్రమ నిర్మాణాలపై కేవలం నోటీసులకే పరిమితమైన మున్సిపల్ అధికారులు వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read More: మాసాబ్‌ చెరువు ఉనికికే ఎసరు.. యథేచ్ఛగా పూడ్చివేత పనులు

Advertisement

Next Story

Most Viewed