గడ్డం పెంచుకుంటే గబ్బర్ సింగ్ లేనా : కేటీఆర్

by Naresh |   ( Updated:2023-11-23 14:18:21.0  )
గడ్డం పెంచుకుంటే గబ్బర్ సింగ్ లేనా : కేటీఆర్
X

దిశ, నేరేడుచర్ల: గడ్డం పెంచుకున్నోళ్లంతా గబ్బర్ సింగ్ కాలేరని మంత్రి కేటీఆర్ ఉత్తమ్ కుమార్‌ పై ఫైర్ అయ్యారు. గత పది ఏళ్ల నుంచి అధికారంలోకి వస్తేనే గడ్డం తీస్తానంటూ పెరిగిన గడ్డాన్ని కట్ చేయించుకోవడమే తప్ప ఇక తీసేది లేదంటూ ఎద్దేవా చేశరు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ హుజూర్ నగర్ పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. సారేనా. కారేనా.. ఉత్తమన్న గడ్డం పెరగాల్సిందేనా అన్నారు. ఉత్తమన్న గత ఎలక్షన్‌లో కూడా కాంగ్రెస్ వస్తేనే గడ్డం తీస్తానని ప్రగల్బాలు పలికారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని.. ఉత్తమ్ గడ్డం తీసేది లేదని అన్నారు. సైదిరెడ్డి గెలిచిన నాలుగేళ్లలో రెండేళ్లు కరోనా టైం పోయిందని మిగిలిన రెండేళ్లలోనే రూ. 4000 కోట్లతో అభివృద్ధి చేశాడని అన్నారు. రెండేళ్లలో సైదిరెడ్డి చేసిన అభివృద్ధి 2 టర్మూలో కూడా ఉత్తమ్ చేయలేదని ఆరోపించారు.

సైదిరెడ్డి నాయకత్వంలో చానా పనులు చేసుకున్నామని, హుజూర్నగర్‌లో ఏసీ హాస్పిటల్ నేరేడుచర్ల మున్సిపాలిటీ రూ. 179 కోట్లతో జాన్ పహాడ్ లిఫ్ట్ రూ. 340 కోట్లతో లిఫ్ట్ కాలువలకు సీసీ లైనింగ్ పనులు తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని అన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఎలా ఉందని ఇప్పుడు ఎలా ఉందంటూ ప్రజలను అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని తెలిపారు. మనం 24 గంటల కరెంటు ఇస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇస్తామంటూ బిల్డప్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.



కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకునే ఉదయపూర్ డిక్లరేషన్‌లో కుటుంబంలో ఒకటే టికెట్ అని అందులో తీర్మానం చేశారని..కానీ మన రాష్ట్రంలో ఉత్తమ్‌కు రెండు టిక్కెట్లు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రెండు టికెట్లు మైనంపల్లి రెండు టికెట్లు ఇచ్చి సొంత పార్టీ డిక్లరేషన్‌ని పక్కన పెట్టిన వాళ్ళకి ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టారన్న గ్యారెంటీ ఎందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే తెలుసునని స్కాములు చేయాలి ..రాష్ట్రాని మింగాలి అనేది తప్ప మరోకటి తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఉత్తమ్ కుంభకోణాలకు పాల్పడ్డారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే పెట్టిన ప్రతి దానిని అమలు చేస్తానని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కావాలన్నా ఇండస్ట్రీలు కావాలన్నా సైదిరెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని తెలిపారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడని ఇక్కడ సమస్యలు సైదిరెడ్డికి తప్ప ఉత్తమ్ కు పట్టవని అన్నారు. అసెంబ్లీలో ఏదైనా అడిగితే నేను ప్రిపేర్ కాలేదని సమాధానం చెబుతారని అన్నారు.

రాహుల్ గాంధీకి ఎద్దు వ్యవసాయం తెలియదని.. ఆయనకు క్లబ్లు, పబ్లు మాత్రమే తెలుసునని విమర్శించారు. కాంగ్రెస్ గతం.. బీఆర్ఎస్ భవిష్యత్ అని.. ఇక్కడ ఉత్తం గతం.. భవిష్యత్తు సైదిరెడ్డి అని పేర్కొన్నారు. భారీ వర్షంలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో ప్రజలను చూసి కేటీఆర్ ఆనందంతో ఇది ఎన్నికల ర్యాలీలా లేదని విజయోత్సవ ర్యాలీల కనిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ , రాష్ట్ర నాయకులు జిన్నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసోజు శంకరమ్మ , గట్టు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story