జాతరలో అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదు

by Naresh |
జాతరలో అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదు
X

దిశ, మేళ్లచెరువు: సాంప్రదాయబద్ధంగా పండుగ వాతావరణంలో జాతర నిర్వహించుకోవాలని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం మేళ్లచెరువులోని కస్తూరి వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ప్రబల కమిటీ సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి జాతర నిర్వహణ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జాతరలో, ప్రబల వద్ద ఆకతాయిలు అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఆటంకం ఏర్పడకుండా మొత్తం ఆరు చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

జాతర పరిసరాలను క్షున్నంగా పరిశీలించడానికి 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతర సందర్భంగా ప్రభలపై ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు సజావుగా నడిచేందుకు కమిటీ వారు పోలీసులకు సహకరించాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ రజిత రెడ్డి, ఎస్సై పరమేష్, డీప్యూటీ తహశీల్దార్ నాగేశ్వరరావు, ఆర్ఐ వాసు స్థానిక నాయకులు సైదేశ్వర రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, గోవింద రెడ్డి, వైస్ ఎంపీపీ గోపిరెడ్డి , సైదేశ్వర రావు, గోవింద్ రెడ్డి, శంకర్ రెడ్డి, భద్ర రావు, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed