- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
జిల్లా గ్రంధాలయానికి నా వంతు సహకారం ఉంటుంది : కలెక్టర్ ఇలా త్రిపాఠి
దిశ,నల్లగొండ: నల్గొండ కేంద్ర లైబ్రరీ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ గా తన వంతు సహకారం అందిస్తానని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయం లో ఈనెల 14 నుంచి 20 వరకు జరగనున్న జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రారంభించారు.పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ముఖ్యంగా ఈనెల 17 18 తేదీల్లో జరగనున్న గ్రూప్-3 పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులు జాగ్రత్తగా పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందాలని అన్నారు. నిర్దేశించిన సమయం కంటే ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, గ్రూప్-3 పరీక్షలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల కోసం బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆమె తెలిపారు.
అభ్యర్థులు ఓ ఎం ఆర్ షీట్ జాగ్రత్తగా నింపాలని, ముందే మాదిరి పరీక్ష రాయాలని, అలాగే ఓఎంఆర్ షీట్ లో వృత్తాలను 75 శాతానికి పైగా నలుపుగా చేయాలని, అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలని, ఒకటికి రెండు సార్లు ఆలోచించి జవాబులు పెట్టాలని సూచించారు. పరీక్ష కేంద్రంలో కి ఎలాంటి చీటీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువెళ్లకూడదని అన్నారు. పరీక్షా సమయం వృధా చేసుకోకుండా పరీక్ష పైన దృష్టి సారించి మంచి మార్కులు పొంది ఉద్యోగం పొందవలసిందిగా ఆమె సూచించారు.అనంతరం మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ వినోద్ రెడ్డి ,గ్రంథాలయ సెక్రటరీ బాలమ్మలు కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి సహకారం అందించాలని కోరగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసే విషయంలో తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.అదనపు కలెక్టర్, గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇంచార్జ్ జే .శ్రీనివాస్, లైబ్రేరియన్ నాగయ్య ,తదితరులు పాల్గొన్నారు.