శంకుస్థాపనలకే పరిమితమయ్యాను : ఎమ్మెల్యే

by Naresh |   ( Updated:2023-10-09 09:51:08.0  )
శంకుస్థాపనలకే పరిమితమయ్యాను : ఎమ్మెల్యే
X

దిశ, మర్రిగూడ: మునుగోడు బై ఎలక్షన్ లో గెలిచి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకే పరిమితమయ్యాను. మళ్లీ ఆశీర్వదిస్తే అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని విజయ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో సోమవారం నిర్వహించిన గృహలక్ష్మి లబ్ధిదారుల మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు గాను 18 గ్రామపంచాయతీలకే మొదట విడత 417 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే మూడు లక్షలు గృహ లక్ష్మీ పథకం మంజూరి అయినట్లు తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ విడతల వారీగా ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. బై ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ప్రభుత్వం రూ. 570 కోట్లల అభివృద్ధి పనులు మంజూరు చేసిందని తక్కువ సమయం ఉండటం వలన శంకుస్థాపనలు మాత్రమే చేశానని మళ్లీ గెలిపిస్తే అభివృద్ధి పనులు అన్నింటిని పూర్తి చేస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు మెండు మోహన్ రెడ్డి ఏడు దొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి జెడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, ఎంపీటీసీలు ఊరి పక్క సరితా నగేష్, రాజమణి ,హరికృష్ణ, కట్కూరి వెంకటేష్, సిలివేరు, విష్ణు, సర్పంచులు నల్ల యాదయ్య, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

ప్రభాకర్ రెడ్డి సోమవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతంపేట నుండి రంగం తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి గాను కోటి 75 లక్షలు, శివన్న గూడెం నుండి అంతంపేట వరకు కోటి 36 లక్షలు లంకలపల్లి నుంచి నేర్మటా గ్రామం మధ్యలో ఉన్న బ్రిడ్జి నిర్మాణానికి గాను ఒక కోటి 65 లక్షలు , లంకలపల్లి గ్రామం నుంచి కమ్మ గూడెం గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి కోటి ఐదు లక్షలు, వట్టిపల్లి నుంచి బట్లపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి గాను ఒక కోటి 35 లక్షలు, మర్రిగూడ ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు బచ్చు రామకృష్ణ, కొలుకులపల్లి యాదయ్య తో పాటు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed