రేషన్ బియ్యంలో భారీ కుంభకోణం..!

by Nagam Mallesh |
రేషన్ బియ్యంలో భారీ కుంభకోణం..!
X

దిశ నల్లగొండ బ్యూరో: రేషన్ బియ్యంలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. పేదలకు, హాస్టల్ విద్యార్థులకు కడుపు కొట్టి అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. బియ్యాన్ని మింగేయడంలో అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కవుతున్నట్లు విమర్శలు వస్తున్నా వాళ్లు మాత్రం అస్సలు ఆగట్లేదు. ఇది ఎక్కడో కాదు సూర్యాపేట జిల్లాలో భారీ స్థాయిలో జరుగుతున్న రేషన్ బియ్యం దందా.

అసలు ఏం జరుగిందంటే?

సూర్యాపేట జిల్లాలో 610 రేషన్ షాపులకు 4900 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతినెలా సరఫరా చేస్తారు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 148 హాస్టల్స్ ప్రతి మూడు నెలలకు ఓసారి 2530 క్వింటాళ్ల బియ్యాన్ని సరఫరా చేస్తుంటారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా రేషన్ షాప్ నుంచే బియ్యం సరఫరా చేస్తున్నారు. పకడ్బందీగా తూకం వేసి బ్యాగులు అధికారుల సమక్షంలోనే ప్యాక్ చేసి దానికి 50 కిలోలు ఉన్నట్లుగా ట్యాగ్ కూడా కట్టేస్తుంటారు. అయితే 50 కిలోల బస్తా లో 44 కిలోలు మాత్రమే బియ్యం ఉన్నట్లు తూకంలో స్పష్టంగా తెలుస్తోంది.. అంటే ఒక క్వింటాళ్ల లో 12 కిలోల బియ్యం తక్కువ తూకం వేస్తూ మిగతా బియ్యాన్ని మెక్కేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రతి మూడు నెలలకొకసారి హాస్టళ్లకు పంపే బియ్యం, రేషన్ షాపులకు పంపిణీ చేసే బియ్యంలో దాదాపు 600లకు పైగా క్వింటాళ్ల బియ్యం పక్కదారి పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ బియ్యం పక్క దారి పట్టడంలో అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.

లెక్క ప్రకారం పంపిణీ చేస్తాం..

రాములు, డిఎం సివిల్ సప్లై, సూర్యాపేట జిల్లా

లెక్క ప్రకారం అందరికీ బియ్యం పంపిణీ చేస్తాం ఒకవేళ తక్కువ వస్తే తిరిగి వాళ్లకు లెక్క చూసి సరఫరా చేస్తాం.

Advertisement

Next Story