- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
దిశ, నల్లగొండ: జిల్లా కేంద్రంలోని షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా దగ్ధమైన ఘటన 44వ వార్డులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాన్యం చెలకకు చెందిన ఇమామ్ మైలానా గులాం రెహమాన్ ఇంట్లో సోమవారం షాట్ సర్కూట్ తో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.ఇంట్లోని వస్తువులు కూడా పూర్తిగా కాలిపోయాయి. స్థానికులు మరియు పట్టణ జమాయితుల్ ఉల్మాయే హింద్ నల్లగొండ జనరల్ సెక్రటరీ మౌలానా మొహమ్మద్ అక్బర్ ఖాన్ రెహమాన్ ను పరామర్శించి తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ మౌలానా గులాం రెహమాన్ మస్జిదే ఆయిషాలో ఇమామ్ గా విధులు నిర్వహిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ తో వారి ఇల్లు పూర్తిగా దగ్ధమవడం తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందన్నారు.
మౌలానా గులాం రెహమాన్ గారిని ప్రభుత్వం తరపున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పిల్లి రామరాజు తక్షణ సాయం కింద రూ.20వేలు ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో మౌలానా యాసిర్, మౌలానా మహమ్మద్ హుస్సేన్, మౌలానా ఉబేదుల్లా, మౌలానా జియావుద్దీన్, మౌలానా హిలాల్ సాబ్, మౌలానా జియావుద్దీన్, మౌలానా హకీబ్ సాబ్ హఫీజ్ సాజిద్ మౌలానాలు తదితరులు పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు.