- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రైతు నుంచి హరీష్ రావుకు చేదు అనుభవం..ఏం జరిగిందంటే..?
దిశ,మర్రిగూడ: మర్రిగూడ మండలంలో ధాన్యం కొనుగోలు వద్ద మాజీ మంత్రి హరీష్ రావుకు రైతు నుంచి చేదు అనుభవం ఎదురయింది. బుధవారం మండల కేంద్రంలో దొడ్డు రకం కొనుగోలు కేంద్రంను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించాడు. హరీష్ రావు మీడియాతో మాట్లాడుతుండగా రైతు రాజేందర్ హరీష్ రావుతో మీ ప్రభుత్వంలో 45 లక్షల రూపాయల అవినీతి జరిగిందని, తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం దొడ్డు రకం సన్న రకం కేంద్రాలను వేరువేరుగా పెట్టడం వల్ల రైతులకు ఇబ్బందులు కలుగుతుందని, రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు జరగడంలేదని హరీష్ రావు ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు జరుగుతున్న మాట వాస్తవమే కానీ..గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మర్రిగూడ వ్యవసాయ సహకార సంఘం పరిధిలో రూ.45 లక్షలు తరుగు పేరిట అవినీతి జరిగిందని ఓ రైతు హరీష్ రావుతో వాగ్వాదానికి దిగాడు. రైతులకు న్యాయం చేయాలని పోరాటం చేస్తే.. వారిపైన మీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని రైతు ఆరోపించారు. దీంతో హరీష్ రావు తర్వాత మాట్లాడదామని ఆయన దాటవేశాడు. అనంతరం రైతుకు ఎలాంటి సమాధానం చెప్పకుండా హరీష్ రావు అక్కడి నుంచి వెళ్ళగా అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తోపాటు కార్యకర్తలు రాజేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు . అంతకు ముందు స్థానిక టిఆర్ఎస్ నాయకుడు దేశ్ముకు తండ్రి పొనుగోటి అంజన్ రావు మృతి చెందడంతో.. ఆయనను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ,పాల్వాయి స్రవంతి, మండల పార్టీ అధ్యక్షుడు శంకర్ మర్రిగూడ మాజీ సర్పంచి నల్ల యాదయ్య తదితరులు ఉన్నారు.