- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హర హర మహాదేవ.. శంభో శంకర..
దిశ, నకిరేకల్: మహాశివరాత్రి పర్వదినాన శైవ ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు దర్శనాలకు బారులు తీరారు. శివయ్యకు అభిషేకాలు, బిల్వ పత్రాలతో అర్చనలు చేశారు. పొద్దంతా ఉపవాస దీక్షలతో మొక్కులు తీర్చుకున్నారు. ఇలా నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
బోలా శంకరుడికి పంచామృతాలు, పండ్ల రసాలు, భస్మంతో, భక్తిశ్రద్ధలతో అభిషేకించారు. వేలాదిమంది భక్తులు కుటుంబ సమేతంగా జిల్లాలోనే ప్రముఖ క్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ పట్టణంలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెర్వుగట్టు దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్ లోనే వేచి చూడాల్సి వచ్చింది.