చెరువును తలపిస్తున్న గుర్రంపోడు తహసీల్దార్ కార్యాలయం

by Aamani |
చెరువును తలపిస్తున్న గుర్రంపోడు తహసీల్దార్ కార్యాలయం
X

దిశ, గుర్రంపోడు: నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం చెరువును తలపిస్తుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మోకాళ్ళ లోతు నీళ్లతో కార్యాలయ ఆవరణ నిండిపోయి ఉంది. ఆఫీస్ లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో సెలవు దినాన్ని తలపిస్తుంది. మండల కేంద్రం నడిబొడ్డున తహసీల్దార్ కార్యాలయం చెరువును తలపిస్తున్న పట్టించుకునే నాధుడు లేడా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మంగళవారం ఇదే కార్యాలయంలో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ జరగగా మండల అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. కానీ ఎవరు స్పందించిన పాపాన పోలేదు.

Next Story