- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్సీ, ఎస్టీ పాడి పశు రైతులకు 20 శాతం రాయితీతో గడ్డి కటింగ్ యంత్రాలు
దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని పశు వైద్యాలయ కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు 20 శాతం రాయితీతో గడ్డిని కత్తిరించే యంత్రాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా పశు వైద్యాధికారి డా. వి. సదానందం బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు పశువుల పెంపకం ప్రధాన ఆదాయ వనరు అని, పాడి పశువుల వృథా మేతను పూర్తిగా అరికట్టడానికి ఈ యంత్రాలు ఎంతో ఉపయోగకరమని, పశువులు తినడానికి కూడా అనువుగా ఉంటుందన్నారు. 3 హెచ్‌పీ సామర్ధ్యంతొ 3బ్లేడ్స్‌తో పని చేసే ఈ యంత్రంరూ. 48 వేలు కాగా, సబ్సిడీ (20 శాతం)తో రూ. 38 వేలకు అందుబాటులో ఉన్నాయన్నారు. పాడి పశువులను పెంచే ఎస్సీ, ఎస్టీలు రైతులు తమ ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, డీడీ రూపంలో 38 వేలు చెల్లించిన ఫామ్ దరఖాస్తుతో ఈ యంత్రాలను జిల్లా పశు కేంద్రంలో కొనుగోలు చేయవచ్చువ అని తెలిపారు.