హుజుర్ నగర్ కు ఐటిఐ కాలేజ్ మంజూరు

by Naveena |
హుజుర్ నగర్ కు ఐటిఐ కాలేజ్ మంజూరు
X

దిశ హుజూర్ నగర్ : హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధిపై మరోసారి రాష్ట్ర నీటిపారుదల & పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి మార్క్ వేశారు. ఎంతో కాలం నుంచి డిమాండ్ లో ఉన్న పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐ.టి.ఐ) ని మంజూరు చేయించడంతో పాటు శాశ్వత భవన నిర్మాణానికి గాను 14.35 కోట్లు నిధులను విడుదల చేయించారు. ఎలక్ట్రిషియన్,ఫిట్టర్,డ్రాఫ్ట్స్ మెన్,డీజిల్ మెకానిక్ లతో పాటు వెల్డర్ కోర్సులలో శిక్షణ నిమిత్తం ప్రారంభిస్తున్నారు. ఈ నూతన ఐటిఐతో ఈ ప్రాంత నిరుద్యోగులకు ప్రయోజనకారిగా మారనుంది. ఐదు కోర్సులలో 216 విద్యార్థులతో ప్రారంభం కానుంది. ఈ ఐటిఐకి ప్రిన్సిపాల్ తో సహా 8 పోస్టులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒప్పించి మంజూరు చేయించారు. గతంలో తాను మంజూరు చేయించిన అడ్వాన్డ్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో.. రామస్వామి గుట్ట వద్ద కొత్తగా మంజూరు అయిన పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐ. టి.ఐ)నీ నెలకొల్పనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Next Story