అయ్యప్ప ఆలయంలో ఘనంగా మహా పడిపూజ

by Naveena |
అయ్యప్ప ఆలయంలో ఘనంగా మహా పడిపూజ
X

దిశ, చౌటుప్పల్ టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం మహా పడిపూజ కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షుడు బొబ్బిల్ల మురళి ఆధ్వర్యంలో..చౌటుప్పల్ పురపాలిక పరిధి లక్కారం గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి గోపాల్ గురుస్వామి 18వ శబరిమల యాత్ర సందర్భంగా మహా పడిపూజ నిర్వహించారు. ఈ సందర్బంగా పంచామృత అభిషేకములు, శ్రీ మహా గణపతి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం, అష్టోత్తర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు కామిశెట్టి భాస్కర్, ఉపాధ్యక్షుడు తూర్పాటి శంకర్, ఉప్పు ఆంజనేయులు, అంతటి రాము గౌడ్, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, ఎలుగుబెల్లి అనిల్, లక్కారం గురుస్వాములు గుండెబోయిన ఆంజనేయులు, గుండెబోయిన వెంకటేష్ గురు స్వామి, సుక్క సుదర్శన్, నాగరాజు, రాజు రెడ్డి, దయాకర్ రెడ్డి, సామ్రాట్, బొంగు బాబు, రాజేష్, అప్పిడి శ్రీను, గోశిక రాజేంద్ర, పందుల స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story