- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజన తండాల అభివృద్ధి కేసీఆర్ లక్ష్యం : మునుగోడు ఎమ్మెల్యే
దిశ, సంస్థాన్ నారాయణపురం : గిరిజన తండాలను గ్రామపంచాయితీలుగా మార్చిగిరిజన ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ నిజమైన గిరిజన బాంధవుడు అని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని గిరిజన తండాలైన కొర్రతండా, గంగముల తండా, కడపగండి తండా, డాకు తండా, రాధనగర్ తండా, బోటిమిది తండా, వాచ్యతండా, పల్లగట్టు తండా, మర్రిబావి తండాల్లో రూ.4 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతనాలుగు సంవత్సరాలుగా మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిపోయిందని, ఆగిన పనులను పూర్తిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని తెలిపారు.
గ్రామపంచాయితీలకు నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పాటు పడుతున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని, బీఆర్ఎస్ పార్టీ చేతల ప్రభుత్వమని దేశంలో బీఆర్ఎస్ పార్టీను ప్రజలు అదరిస్తున్నారని అన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉమాప్రేమ్చందర్ రెడ్డి, జెడ్పీటీసీ భానుమతి వెంకటేష్, పీఏసీఎస్ చైర్మన్ జక్కిడి జంగరెడ్డి, వైస్ ఎంపీపీ రాజు, ఎంపీటీసీలు కరంటోతు విజయ, నరేష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు దోనూరి జైపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, గిరిజన తండాల సర్పంచులు, అధికారులు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.