- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Fluorosis: ఫ్లోరోసిస్ ఉద్యమకారుడు అంశాల స్వామి మృతి
దిశ, మర్రిగూడ: ఫ్లోరోసిస్ విముక్తికై అలుపెరుగని పోరాటం చేసిన పోరాట యోధుడు అంశాల స్వామి(32) శనివారం ఉదయం మృతిచెందాడు. శుక్రవారం దాత ఇచ్చిన బ్యాటరీ మోటార్ సైకిల్ నుంచి కిందపడి గాయపడ్డాడు. శనివారం ఉదయం మృతిచెందాడు. ఫ్లోరోసిస్ విముక్తికై కంచుకట్ల సుభాష్ తో కలిసి గత 20 సంవత్సరాలుగా ఫ్లోరోసిస్ విముక్తి కోసం ఐదుగురు ప్రధానులను కలిసి సమస్యను వివరించి కృష్ణా జలాలను సాధించాడు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న శివన్నగూడ ప్రాజెక్టు ఆయన చేసిన కృషితోనే ఏర్పాటు జరిగింది. స్వామి అకాల మరణంతో ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవలనే స్వామికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లుతోపాటు సెలూన్ షాపు నిర్మించి అతని ఇంట్లో స్వామితో కలిసి భోజనం చేసిన విషయం పాఠకులకు విధితమే. అంశాల స్వామి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. స్వామి మృతి పట్ల జిల్లా ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా, స్వామి మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు.
ఇవి కూడా చదవండి: అబ్బురపరిచేది ఎప్పుడు? మూడేండ్ల క్రితం ప్రకటించిన KCR