ఫిషరీస్ ఆఫీసర్ రాజారామ్‌ను సస్పెండ్ చేయాలి

by Naresh |
ఫిషరీస్ ఆఫీసర్ రాజారామ్‌ను సస్పెండ్ చేయాలి
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్: నిత్యం మత్స్యకారులను వేధిస్తూ, మత్స్యకారులను ఇబ్బందులకు గురి చేస్తున్న అవినీతి తిమింగలం జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ రాజారామ్‌ను వెంటనే సస్పెండ్ చేయడాలని శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు పూస శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని బాబు జగ్జీవన్ రావు చౌరస్తాలో జరిగిన మత్స్యకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో పర్మిషన్ కోసం కార్మికులు పోతే వేలల్లో లంచం అడుగుతున్నారని సహకార సంఘాలకు ఫిషింగ్ ఆర్డర్, చేపలు పట్టుకొనే అనుమతి పత్రాలకు లక్షల్లో డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గమైన అవినీతి అధికారిని చూడలేదని 'చేపల మార్కెట్ల' కేటాయించడం కోసం స్థలం ఇప్పిస్తా ఎన్ని లక్షలు ఇస్తారో చెప్పండని తెలిపారు. 'అనుమతి లేకుండా చేపలు పడుతున్నారని' లక్ష ఇవ్వండి... అన్ని నేను చూసుకుంటానంటూ… లేకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాన్ని మీకు అందకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. మార్కెట్ ఏర్పాటు చేయిస్తానంటూ అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నందున ఇతనిని వెంటనే సస్పెండ్ చేసి 30 వేల మంది మత్స్యకార్మికులకు న్యాయం చేయాలని అన్నారు. నూతన సొసైటీలకు రూ. 6 లక్షల నుంచి రూ.7లక్షల వరకు వసూలు చేస్తున్నారన్నారు. నాణ్యతలేని చేప పిల్లలు వదిలిన కాంట్రాక్టర్ దగ్గర 35 శాతం కమీషన్ లక్షల్లో తీసుకున్నారని అతని ఆస్తులు కోట్లలో ఉంటాయని వెంటనే అతని ఆస్తుల పై న్యాయ విచారణ చేపట్టాలని లేకుంటే 'ఆమరణ దీక్ష' చేసి మత్స్యకార్మికుల తడాఖా చూపిస్తామని పూస శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శివసేన నాయకులు బసంతి జ్ఞానేశ్వర్, మన్నెం నర్సింగ యాదవ్, కె బాలమల్లు, ఈశ్వరమ్మ, ధనమ్మ, మహిళా సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story