- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Cyber Crime : ఆన్లైన్ లో ఆవులు ఆర్డర్ పెట్టిన రైతు

దిశ, వెబ్ డెస్క్ : తక్కువ ధరకు వస్తున్నాయని ఓ రైతు ఆవుల(Cows)ను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాడు. యూట్యూబ్లో ఆవుల వీడియో చూసి తనకు కూడా అలాంటి ఆవులు కావాలని భారీ మొత్తం డబ్బులు చెల్లించి కొన్నాడు. ఎన్నిరోజులు అయినా అవి ఇంటికి రాకపోవడంతో మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు ఆ రైతు. ఈ ఘటన వివరాలలోకి వెళితే.. యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతు కొండయ్య యూట్యూబ్లో ఆవుల వీడియో చూశాడు. మూడు ఆవుల కోసం బాధితుడు రాజస్థాన్‌కు చెందిన కుమార్జైకి ఆన్లైన్లో ఆర్డర్పెట్టాడు. మూడు ఆవుల కోసం ఫిబ్రవరి 5న ఆవులు పంపటానికి వెహికిల్ కోసం మరో రూ.15 వేలు కుమార్జై అనే వ్యక్తికి ఫోన్‌పే చేశాడు. సిద్దిపేట వరకు ఆవులు చేరాయని, మొత్తం అమౌంట్ చెల్లించాలని బాధితుడికి సైబర్ కేటుగాడు చెప్పాడు.
అతడు చెప్పిన విధంగానే ఫిబ్రవరి 6న విడతల వారీగా మొత్తం రూ.84 వేలను రైతు అతడికి చెల్లించాడు. తాను డబ్బు చెల్లించినప్పటికీ ఆవులు ఎంతకీ రాకపోవడంతో సదరు వ్యక్తికి ఫోన్ చేశాడు బాధితుడు. ఎన్నిసార్లు కాల్ చేసినప్పటికీ స్విచ్ఆఫ్అని రావడంతో తాను మోసపోయినట్లుగా అతడు గుర్తించాడు. రోజులు గడిచినా ఆవులు రాకపోవడంతో బాధితుడు ఎల్బీనగర్లోని సైబర్ క్రైమ్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన భువనగిరి రూరల్ పోలీసులు, ఈరోజు కొండయ్య స్టేట్మెంట్ను రికార్డు చేశాడు. తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను వేడుకున్నాడు.