- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించాలి
దిశ, మునుగోడు : ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందించి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహన్ని ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులు, బాలింతల రికార్డును పరిశీలించారు. శిథిలావ్యస్థలో ఉన్న వసతి గృహాన్ని మరమ్మతులు చేయడానికి ప్రణాళిక తయారు చేయాలని మండల పంచాయతీ రాజ్ ఏఈ సతీష్ రెడ్డి ఆదేశించారు. గ్రామాలలో 13, 14 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులే ఎక్కువ గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు అలవాటు పడుతున్నారని, వారిపై ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ప్రత్యేక శ్రద్ద పెట్టి వారి కదలికలను పరిశీలించి వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
గ్రామాలలో 100లో 65మంది గర్భిణులు ఆపరేషన్ కు గురౌతున్నారని, అవసరమైతే తప్పా ఎవ్వరూ ఆపరేషన్ చేయించుకోకుండా ఏఎన్ఎంలు, ఆశాలు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఇచ్చే కమీషన్ కు కక్కుర్తి పడి ఆరోగ్య సిబ్బంది గర్బిణులను ప్రైవేట్ ఆసుపత్రికి పంపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయని, అలా జరిగితే వారిపై చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటున్నందుకు ప్రజలకు మేలైన సేవలు అందించాలన్నారు. కరోనా సమయంతో వైద్యాధికారుల కంటే ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ఎక్కువ పాత్ర పోషించారని అన్నారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ పూజ, తహసీల్దార్ నరేందర్, వైద్యాధికారులు నర్మద, మాధురి, పంచాయతీ రాజ్ ఏఈ సతీష్ రెడ్డి, ఎంపీఓ, సూపర్వేజర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.