- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుంగతుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా.. అఖిలపక్ష నేతల ముందస్తు అరెస్టులు
దిశ,అర్వపల్లి/తుంగతుర్తి: ఇటీవల తిరుమలగిరిలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ, కాంగ్రెస్, అఖిలపక్ష పార్టీల నేతలతో పాటు ఎమ్మార్పీఎస్ సంఘాల నాయకులను ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తన వ్యాఖ్యలతో కించపరచడాన్ని నిరసిస్తూ బుధవారం తిరుమలగిరి మండల కేంద్రంలో నిర్వహించతలపెట్టిన అఖిలపక్ష ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగానే నియోజకవర్గ వ్యాప్తంగా పలువురిని అరెస్టులు చేశారు. నూతనకల్ మండల కేంద్రంలో మంగళవారమే అఖిలపక్ష నేతలు నిర్వహించిన ధర్నా, రాస్తారోకో కార్యక్రమానికి సంబంధించి పలువురిని అరెస్టు చేశారు. అలాగే జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, తిరుమలగిరి, తదితర మండలాలలో బుధవారం తెల్లవారుజాము నుండే బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, ఎంఆర్పీఎస్, ఇతర దళిత సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
పోలీసుల దిగ్బంధంలో తిరుమలగిరి
తిరుమలగిరి మండల కేంద్రంలో బుధవారం అఖిలపక్ష నేతలు నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని పురస్కరించుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, నాగారం, తిరుమలగిరి మండలాల నుండే కాకుండా ప్రాంతాల నుంచి సీఐ,ఎస్ఐలు, వందలాది మంది పోలీసులు ఉదయాన్నే తిరుమలగిరి చేరుకొని బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.అంతేకాకుండా ముందస్తుగా మంగళవారం రాత్రి నుండే పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్,బిజెపి, వైయస్సార్ టిపి, తదితర పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాల నాయకుల ఆచూకీలను తెలుసుకుంటూ అరెస్టులు చేస్తూ వచ్చారు.ముఖ్యంగా వైయస్సార్ టి పి అధ్యక్షురాలు వైయస్ షర్మిల, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా నాయకులు ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ముందస్తుగానే ప్రకటించడంతో తిరుమలగిరి మండల పరిస్థితులు ఉద్రిక్తతగా మారాయి.