పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ

by Naveena |
పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ
X

దిశ,కనగల్లు: వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం కనగల్లు పోలీస్ స్టేషన్ ను నల్గొండ డిఎస్పి కే. శివరాంరెడ్డి తనిఖీ చేశారు. డిఎస్పికి ఎస్సై పి.విష్ణు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. తనిఖీకి ముందు ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని డీఎస్పీ సందర్శించి పూజలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ..శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. డయల్ 100 ఫిర్యాదులపై వేగంగా స్పందించాలన్నారు. సీసీ కెమెరాలు అవశ్యకత గురించి ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. రాత్రి జరుపుకునే డిసెంబర్ 31 వేడుకలను ప్రజలు ప్రశాంతంగా ఇళ్ల వద్ద నుండి జరుపుకోవాలని మద్యం సేవించి రోడ్లపైకి రాకూడదని ఎటువంటి మత్తు పదార్థాలను వినియోగించారాదని సూచించారు. ఎవరైనా పోలీసుల సూచనలను బ్రేక్ చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్ఐ పి.విష్ణు, ఏఎస్ఐ నరసింహారెడ్డి, సురేష్, రమేష్, బురాన, స్టేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed