దిశ ఎఫెక్ట్.. నిలిపివేసిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ

by Kalyani |
దిశ ఎఫెక్ట్.. నిలిపివేసిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ
X

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు): అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే దట్టమైన పొగ వల్ల ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా రైతుల పంట పొలాలు నష్టపోవడం దుమ్ము, ధూళి వ్యాప్తి చెందడంతో సమీప గ్రామాల ప్రజలు శ్వాస కోస వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శుక్రవారం ‘దిశ’ పత్రికలో కాలుష్యం చిమ్ముతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అని కథనం ప్రచురించడం జరిగింది. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు ఆ యజమానానికి శుక్రవారం ఉదయం ఫోన్ చేసి వెంటనే ఫ్యాక్టరీ నిలిపివేయాలని ఆ డస్ట్ రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాల మేరకు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్లాంట్ నిలిపివేసి ఆ పొగ గొట్టంలోని రిటర్న్ ఎయిర్ బ్యాగ్స్ సిస్టమ్ ను మారుస్తున్నట్లు స్థానికుల ద్వారా సమాచారం. ఎయిర్ బ్యాగ్ సిస్టం పూర్తిగా మార్చి కాలుష్యం వెలువడకుండా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే ఫ్యాక్టరీని నడపనున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed