- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ ఎఫెక్ట్... పంచాయతీ కార్యదర్శిపై వేటు
by Sridhar Babu |

X
దిశ, నల్గొండ బ్యూరో : చివ్వెంల మండలంలోని గాయంవారిగూడెంలో ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 194 లో సుమారు 280 గజాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయిం చుకున్న పంచాయతీ కార్యదర్శి గౌరీదేవి రవీందర్ పై వేటు పడింది. ఈయన ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని మోతె మండలం బుర్కచర్ల గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. జీవో 59 తో అక్రమంగా ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని దిశ పత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. అదేవిధంగా ప్రజావాణిలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కు ఆధారాలు అందజేశారు. విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
- Tags
- Disha Effect
Next Story