ప్రజల మన్ననలు పొందుతున్న పత్రిక దిశ...

by Naveena |
ప్రజల మన్ననలు పొందుతున్న పత్రిక దిశ...
X

దిశ, కోదాడ : నిరంతరం ప్రజల కోసం అక్షర పోరాటం కొనసాగిస్తూ ప్రజా మన్ననలో పొందుతున్న పత్రిక దిశ అని కోదాడ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలో దిశ 2025 నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా అటు ప్రజలకు ప్రభుత్వానికి సమాచారం అందిస్తుందన్నారు. ఇంకా దినదినాభివృద్ధి చెందాలని కోరారు. ఈ ఏడాదిలో కూడా దిశ ఇదే చూపుతో సమాజానికి ఉపయోగ పడే కథనాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దిశపత్రిక కోదాడ ఇంచార్జ్ పగడాల వాసు, అనంతగిరి రిపోర్టర్ కొలిచలం శ్రీనివాస్, రావెళ్ల కృష్ణారావు, వేమూరి విద్యాసాగర్,భాస్కరరావు,వెంకటేశ్వరరావు,వెంకటేష్,దేవమని,ప్రసాద్,శ్రీను,కిరణ్ రెడ్డి, బాబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story