- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శవంతో ఇంటిముందు ధర్నా.ఎందుకంటే..?
దిశ, హాలియా : గత రెండు రోజుల క్రితం కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. దీంతో భవాని నిలయం బహదూర్ కుటుంబానికి న్యాయం చేయాలని మృతదేహంతో సంబంధిత ట్రావెల్స్ యజమాని ఇంటి ఎదుట మృతుని బంధువులు ఆదివారం ఉదయం ధర్నాకు దిగారు. తెలిసిన వివరాల ప్రకారం..హాలియాలోని రెడ్డి కాలనీలో నివాసముంటున్న నేపాల్ కు చెందిన గూర్ఖా భవాని నిలయం బహదూర్(52) శుక్రవారం త్రిపురారం వెళ్తుండగా.. త్రిపురారం సమీపంలో ఉన్న తౌడు మిల్లు వద్ద హాలియా గాయత్రి ట్రావెల్స్ కు చెందిన కారు ఢీకొంది. దీంతో బహదూర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. కాగా నిరుపేద కుటుంబానికి చెందిన బహుదూర్ కుటుంబాన్ని ఆదుకోవాలని గత రెండు రోజులుగా వాహన ఓనర్ తో పాటు ట్రావెల్స్ యజమాని వేడుకున్నప్పటికీ ఎటువంటి సహాయం అందించక పోవడంతోపాటు.. ప్రమాదానికి గురిచేసిన కారుకు సరైన పత్రాలు లేకపోవడంతో కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాల్సిన పరిస్థితి నెలకొందని బంధువులు వాపోయారు. ప్రమాదం చేసిన డ్రైవర్ తో పాటు.. సంబంధిత గాయత్రి ట్రావెల్స్ యజమానిపై చర్యలు తీసుకోవాలని బహదూర్ బంధువులు డిమాండ్ చేశారు. బహదూర్ కు ఎనిమిది మంది సంతానం కావడంతో.. తమను ఆదుకోవాలని కోరారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న యజమాని చనిపోవడంతో.. తాము అనాధలం అయ్యామని మృతుని భార్య వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు శవం తీసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. దీంతో పోలీసులు బహుదూర్ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.