- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ధరణి సమస్యలు పరిష్కరించాలి
దిశ,రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు బుధవారం రాజపేట మండలంలో సందర్శించారు. రాజపేట తాసిల్దార్ కార్యాలయం రికార్డు రూమ్ సందర్శించి.. బయట వ్యక్తులను రానివ్వకూడదని, కార్యాలయం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దరఖాస్తు చేసిన రైతులకు నిజప్రతులు వెంటనే ఇవ్వాలన్నారు. ధరణి సబ్ రిజిస్టార్ రూమ్ దర్శించి..స్లాట్ బుక్ చేసుకున్న రైతులకు వాస్తవ రికార్డుల పరిశీలన ద్వారా అందుబాటులో ఉండాలన్నారు. సమయం ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయాలన్నారు. సిబ్బందిని కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు , కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడాలని, మీసేవ సర్టిఫికెట్స్ అన్ని పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. ధరణి లో రైతుల నుంచి వచ్చిన అప్లికేషన్లు సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం రాజపేట జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం గురించి అడిగి తెలుసుకున్నారు. రేణిగుంట గ్రామంలో ధాన్యాం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేసి..రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు. బసంతాపురం గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే పరిశీలించి,ఏలాంటి తప్పులు దొరలకుండా విధించిన సమయంలోగా సర్వే పూర్తి చేయాలని, ఎన్యుమరైటర్లను ఆదేశించారు. ఆయన వెంట మండల స్పెషల్ ఆఫీసర్ శ్యాంసుందర్, తాసిల్దార్ దామోదర్ యాదవ్, సీనియర్ అసిస్టెంట్ యాదగిరి, ఏ ఆర్ ఐ నర్సింలు, ఎంపీ ఓ జగన్ , అగ్రికల్చర్ ఏవో పద్మజ తదితరులు పాల్గొన్నారు.