పార్టీలకు అతీతంగా అభివృద్దే ఏకైక లక్ష్యం: MLA Kusukuntla Prabhakar Reddy

by Satheesh |   ( Updated:2022-11-29 15:40:43.0  )
పార్టీలకు అతీతంగా అభివృద్దే ఏకైక లక్ష్యం: MLA Kusukuntla Prabhakar Reddy
X

దిశ, చండూర్: పార్టీలకు అతీతంగా అభివృద్దే ఏకైక లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం స్థానిక భవాని ఫంక్షన్ హల్ల్‌లో ఏర్పాటు చేసిన మున్సిపల్ సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపల్ అభివృద్ధిలో వార్డ్ కమిటీ సభ్యులు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. చండూర్‌లోని ఆరు పడకల హాస్పత్రిని 30 పడకల హాస్పత్రిగా మారుస్తామన్నారు. సీతారమచంద్ర స్వామి దేవాలయ భూమిలో సమీకృత మార్కెటును ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరు అదనపు గదులను నిర్మిస్తామని తెలిపారు. వచ్చే నెల నుండి ఇంటి స్థలం ఉన్నవారికి ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. అంగడిపేటలో బస్తి దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. పావలా వడ్డీ రుణాలకు సంబందించిన వడ్డీ పైసలు బ్యాంకుల్లో జమకావటం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story