- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎండిపోయిన చెట్లతో ఎప్పటికైననా ప్రమాదమే
దిశ,నాగారం: మండల కేంద్రంలో రహదారి వెంట ఉన్న వృక్షాలు ఎండి ప్రమాదకరంగా మారాయి. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు కొన్ని ఎండిపోయి ప్రమాదానికి నిలయాలు మారాయి. మరికొన్ని చెట్లు మానులుగా మారి రహదారిపై కొమ్మలు విరిగపడుతుండటంతో.. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గాలిదుమ్ముల సమయంలో రహదారిపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. మండల కేంద్రం నుంచి తుంగతుర్తి కి వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు లో కరెంటు తీగలపై పడిన చెట్టు కొమ్మ దిశ కథనంపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు సోమవారం ఉదయం 8:30 లకు తీగలపై పడిన చెట్టు కొమ్మను తీయించారు.దీంతో ప్రయాణికులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.కానీ ఇదే రోడ్డులో ఎండిపోయిన చెట్లు 6 ఎండిపోయి ఎప్పుడు విరిగి పడుతాయోనని ప్రయాణికులు ఆందోళన చెందుతూ ప్రయాణిస్తున్నారు.ఆర్ అండ్ బీ అధికారులు ప్రమాదం జరిగినప్పుడే స్పందించడం అనే ధోరణి కాకుండా ఎండిపోయిన చెట్ల రూపంలో ఇంకా ప్రమాదం పొంచి ఉందనీ ఆర్ అండ్ బి అధికారులు గ్రహించాలని,నిర్లక్ష్యం వీడి ఎండిపోయిన చెట్లు తొలగించాలని,ప్రయాణికులు,ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.