- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన అప్పుడే.. దామోదర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నిక జరగనుంది. దీంతో అక్కడ అధికారం చేజిక్కించుకోవాలని అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ పార్టీలు ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌కు అడ్డాగా ఉన్న మునుగోడులో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఉపఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజుతో పార్టీ సీనియర్ లీడర్ జానారెడ్డి భేటీ అయ్యారు. అంతకుమందే జానారెడ్డితో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం దామోదర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు కాంగ్రెస్ అడ్డా.. నాయకులంతా కలిసి పని చేస్తున్నారని తెలిపారు. అలాగే కాంగ్రెస్ నాయకులంతా కసితో ఉన్నారు. మునుగోడులో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టం చేశారు. అదేవిధంగా ఇప్పట్లో అభ్యర్థి ఎంపిక ఉండదని క్లారిటీ ఇచ్చారు.
ఫార్మా కంపెనీల కోసం ప్రభుత్వం భూములు గుంజుకుంటుర్రు.. బండికి బాధితుల మొర