- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యాంగాన్ని మార్చటం కాదు... పటిష్టం చేయాలి : MP Komatireddy Venkat Reddy
దిశ, నకిరేకల్ : రాజ్యాంగాన్ని మార్చడం కాదు పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. ప్రతి దళితుడికి సొంత ఇల్లు, చదువుకున్న వారికి ఉద్యోగం వచ్చినప్పుడే అంబేద్కర్ కు నిజమైన నివాళులు అన్నారు. దళితులకు న్యాయం జరిగినప్పుడే రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నార్కట్ పల్లి మండలంలోని షాపల్లి, పోతినేనిపల్లె గ్రామాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుచూపుతో అంబేద్కర్ న్యాయశాఖ చదవకముందుకే రాజ్యాంగాన్ని నిర్మించారన్నారు. అంబేద్కర్ ఆశయాలకు ప్రభుత్వాలు, నాయకులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దైద రవీందర్, మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఊశయ్య, వడ్డె భూపాల్ రెడ్డి, మాదాసు చంద్రశేఖర్, సైదులు, వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.