పోలీసుల మామూళ్ల పంచాయితీ..

by Sumithra |
పోలీసుల మామూళ్ల పంచాయితీ..
X

దిశ, పెన్ పహాడ్ : నూతన సంవత్సర వేడుకలు చేసుకోమని ఇచ్చిన డబ్బులు ఒక్కరే వాడుకోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు ఖాకీలు పిడి గుద్దులు కురిపించుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా పెన్‌ పహాడ్ మండల పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఎస్సై గోపి కృష్ణ తెలిపిన ప్రకారం పోలీస్ స్టేషన్‌ లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ జాటోత్ రవికుమార్, హోంగార్డు గంజి శ్రీనుకు కలిపీ డిసెంబర్ 29 న మండల కేంద్రంలోని ఓ టీ స్టాల్ యజమాని నూతన సంవత్సరం రోజు దావత్ చేసుకోమని రూ.1500 ఇచ్చాడు.

రవికుమార్ ఒక్కడే ఆ డబ్బులను వాడు కోవడంతో ఇద్దరి మధ్య స్టేషన్‌ లో గొడవ జరిగింది. మాటల యుద్ధం పెరిగి పిడి గుద్దులు ఘర్షణ దాకా పోయింది. ఇదంతా పోలీస్ స్టేషన్‌ కు వచ్చిన ప్రజల ముందే జరగడం గమనార్హం. ఈ విషయం జిల్లా ఎస్పీ సన్‌ ప్రీత్ సింగ్ దృష్టికి వెళ్లడంతో కానిస్టేబుల్ రవి కుమార్‌ను సస్పెండ్ చేశారు. హోంగార్డు శ్రీనును వీఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story