కాంగ్రెస్ అంటే దొరల పాలన కాదు ప్రజా పాలన : బీర్ల ఐలయ్య

by Naresh |
కాంగ్రెస్ అంటే దొరల పాలన కాదు ప్రజా పాలన : బీర్ల ఐలయ్య
X

దిశ, యాదగిరిగుట్ట : కాంగ్రెస్ అంటే దొరల పాలన కాదని ప్రజల పాలన అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా పాలనకు వంద రోజులు ప్రజా నాయకునికి 100 ప్రశ్నలలో పేరుతో మంగళవారం పాత్రికేయులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ... యాదాద్రి పునర్నిర్మాణ అనంతరం కొండపైన భక్తులు బస చేయడానికి వీలు లేకుండా ఉండేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోని యాదాద్రి కొండపైన బస చేసేలా పూర్వవైభవం తీసుకువచ్చామని గుర్తు చేశారు. అదే విధంగా గత ప్రభుత్వంలో ఆటో కార్మికుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఇచ్చిన హామీ ప్రకారం ఆటో కార్మికులను కొండపైకి ఆటోలను అనుమతించామన్నారు.

యాదాద్రి ఆలయ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిపై చర్యలతో పాటు బదిలీలు ఉంటాయని వారికి హెచ్చరించారు. అలాగే యాదగిరిగుట్ట పట్టణంలో ఉన్న బ్రిడ్జిను నిపుణులతో చర్చించి దానిపై ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. అలాగే డ్రగ్స్, గంజాయి ఇది ఎవరు వినియోగించిన కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులను సాధ్యమైనంత త్వరగా మూసి వేయిస్తామని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరిత గతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ నాయకుడు సంజీవరెడ్డి, కానుగు బాలరాజ్ గౌడ్, ఆలేరు నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed