ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంపై ఆసత్య ఆరోపణలు మానుకోవాలి

by S Gopi |
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంపై ఆసత్య ఆరోపణలు మానుకోవాలి
X

దిశ, హుజూర్ నగర్: మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంపై అసత్య ఆరోపణలు మానుకోవాలి అని హుజూర్ నగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుక్కడపు మహేష్ గౌడ్ హెచ్చరించారు. మరోమారు జర్నలిజం ముసుగులో అవినీతి, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పిచ్చి ప్రేలాపనలు మానుకోకపోతే యూత్ కాంగ్రెస్ సత్తా చూపెడతామన్నారు. మంగళవారం మల్లన్న వ్యాఖ్యలకు ఖండిస్తూ హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్ని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులతో కలిసి స్థానిక శాంతి స్థూపం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మల్లన్న దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

అనంతరం కుక్కడపు మహేష్ గౌడ్ మాట్లాడుతూ... దేశ సైన్యంలో యుద్ద విమాన ఫైలట్ గా అయిదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షులుగా ప్రజలకు సేవలందిస్తున్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని విమర్శించే స్థాయి మల్లన్నకు లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పిచ్చి ప్రేలాపనలు మానుకుంటే ప్రజలే దేహశుద్ది చేస్తారని అన్నారు. విలువలు లేకుండా వీడియోలలో ఇష్టం వచ్చినట్లు అసత్య విమర్శలకు పాల్పడితే యూత్ కాంగ్రెస్ ఆగ్రహానికి రుచి చూడాల్సి వస్తుందన్నారు. ప్రజాక్షేత్రంలో గెలవలేని నువ్వు ప్రజల మనుషులను విమర్శిస్తే సహించేది లేదన్నారు. తక్షణమే తన ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ కందుల వినయ్, నియోజకవర్గ జనరల్ సెక్రటరీ పులి బాలకృష్ణ, హుజూర్ నగర్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడపంగు రాము, గరిడేపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బచ్చలకూరి కృష్ణ, నర్సింగ్ ఉపేందర్, పానుగోతు శివ నాయక్, కందుల వినోద్, అయిల ఉపేందర్, కార్తీక్, నవీన్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed