- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలందరినీ ఆదుకునే పార్టీ కాంగ్రెస్ : తీన్మార్ మల్లన్న
దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): దేశంలో అన్ని వర్గాల ప్రజలందరిని ఆదరించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ తీన్మార్ మల్లన్న అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మందుల సామేల్‌కు మద్దతుగా మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతుందన్నారు. తుంగతుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్‌ను గెలవనిచ్చేది లేదని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అమాయకులపై కేసులు మోపుతున్నారని, ఈ అక్రమ కేసుల నుంచి విముక్తి లభించాలంటే,పేదోడే అయినా..పెద్ద మనస్సున్న ఉద్యమకారులు, స్థానికుడైన మందుల సామేల్‌ను ఆశీర్వదించాలని కోరారు.
మండలంలోని పర్సాయపల్లి, పడమటి తండా, కాసర్ల పహాడ్, కొమ్మాల, నాణ్యాతండా, లోయపల్లి, కోడూరు, సూర్య నాయక్ తండా, కోమటిపల్లిలో మండల అధ్యక్షులు మోరపాక సత్యం అధ్యక్షతన జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామేల్ మాట్లాడుతూ... తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగే ఈ ఎన్నికలు ఇసుక దోపిడీదారులకు, దోపిడీ వ్యతిరేకులకు మధ్య పోటీ జరుగుతుందని అన్నారు. మూసీ మాజీ చైర్మన్ అల్వాల వెంకటస్వామి, జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కుంభం రమేష్,రవి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దరూరి యోగానంద చార్యులు, అన్నెపర్తి జ్ఞానసుందర్, గుడిపాటి నర్సయ్య, పర్రెపాటి యుగేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అనిల్ రెడ్డి రాజేందర్ రెడ్డి, నర్సింగ శ్రీనివాస్ గౌడ్, దాసరి సోమయ్య, వేల్పుల రమేష్,శిగ నసీర్,మేకల రాంబాబు, మహరాజు, సైదులు, జగన్నాథం, కృష్ణమూర్తి, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.