- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్రలో మూడు నెలల్లో విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వమే
దిశ, చివ్వెంల: చరిత్రలో మూడు నెలల్లో విఫలమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, సీఎంగా కేసీఆర్ ఉంటే కరువు వచ్చేది కాదని ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐదవ వార్డు దురాజ్ పల్లిలో గల శ్రీ లింగమంతుల స్వామి ఆలయ ప్రాంగణంలో ఎంపీ రాజ్యసభ రూ. 65 లక్షల నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యేల పేర్లు తెరవడం కాదు శ్రీశైలం సాగర్ గేట్లను తెరవాలని అన్నారు. గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించి కౌంటర్ వేశారు. ఎమ్మెల్యేలను కొనాలనే సోయి తప్ప ప్రజల కష్టాల పై కాంగ్రెస్‌కి పట్టింపు లేదన్నారు. వ్యాపారులను బెదిరించి ఢిల్లీకి ముడుపుల సోయి తప్ప సీఎంకి వేరే యావ లేదన్నారు. ఇక ఎన్ని అబద్ధాలు చెప్పినా, ప్రజలు కాంగ్రెస్‌ని నమ్మే పరిస్థితి లేదన్నారు. కరువు పాపం కాంగ్రెస్‌దే అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ గేట్లు బద్దలుగొట్టేలా ఉన్నారని అన్నారు. మూడు నెలల్లో విఫలమైన ప్రభుత్వంగా తెలంగాణా లోనే కాంగ్రెస్ నిలబడిందని అన్నారు.
కేసీఆర్ ఉంటే కరువొచ్చేది కాదన్నారు. డ్రామా లాడి ప్రభుత్వం నడపడం మానేసి ఇప్పటికైనా దమ్ముంటే సాగు నీరు ఇవ్వండి , కరువు సమీక్షలు చేయండి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాత వెలుగులు పోయి చీకట్లు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ పోయింది, సాగు తాగు నీరు లేదు , పంట పెట్టుబడి లేక తిరోగమన మార్పు వచ్చిందన్నారు. కాంగ్రెస్ రాజకీయ కక్ష సాధింపుతోనే తెలంగాణకు కరువు వచ్చింది అన్నారు. కుంగిన మేడిగడ్డ పిల్లర్లకు నీళ్ళు ఎత్తి పోసుకోవడానికి సంబంధం లేదన్నారు. ఇవ్వాళ్టికి కూడా కాళేశ్వరంలో 4 వేల క్యూసెక్కుల నీటి లభ్యత ఉందన్నారు.మీ కర్ణాటక మిత్రులతో మాట్లాడి కృష్ణా నుండి 10 టీఎంసీల నీటిని తెప్పించాలి అని డిమాండ్ చేశారు.సాగునీరు లేక రైతుల కంట కన్నీళ్లు కారుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్న రైతులను ఓదార్చే నాయకులే లేరని మండిపడ్డారు. తక్షణమే కరువు సమీక్షలు పెట్టాలని జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పేరుమల్ల అన్నపూర్ణ, జడ్పీటీసీలు, ఎంపీపీలు ,వార్డు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.