- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం: స్వరూప రాణి రవి ముదిరాజ్
దిశ, మునుగోడు: మునుగోడు, పలివెల గ్రామ పంచాయతీ పరిధిలోని రైతు వేదికలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవానికి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్మన్, జడ్పిటిసి నార బోయిన స్వరూప రాణి రవి ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై రైతులని ఉద్దేశించి మాట్లాడారు. గత పాలకుల హయాంలో జరిగిన రైతుల కష్టాలని వివరించి అలాగే తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతును రాజుగా చూడటం కోసం అనేక పథకాలు తెచ్చారన్నారు. ఇందులో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, గిట్టుబాటు ధర, పిఎసిఎస్, ఐకేపీ మార్కెట్ లను ఏర్పాటు చేసి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు.
కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు కట్టి రెండు విడతల పంటలకి నీరు అందిస్తూ రైతులను ఆదుకుంటున్నారు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అందిస్తూ.. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అయ్యాడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మండల సర్పంచ్‌లు మిర్యాల వెంకన్న, గజ్జెల బాలరాజు, నందిపాటి రాధా, ఎంపీటీసీలు భీమనపల్లి సైదులు, చెరుకు కృష్ణయ్య, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ జాజుల అంజయ్య, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.