- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కుల గణన దేశానికే మోడల్
దిశ,తుంగతుర్తి: కుల గణన సర్వే కార్యక్రమం దేశానికే మోడల్ గా నిలుస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ పేర్కొన్నారు. ఇలాంటి సర్వేలు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైందని వివరించారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో శనివారం ఆయన కుల గణన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కామారెడ్డి,వరంగల్ ప్రాంతాలలో తమ పార్టీ అగ్ర నేతలు ఇచ్చిన మాట ప్రకారం కుల గణన సర్వేకు కట్టుబడి ముందుకు సాగుతోందని అన్నారు.ఈ కార్యక్రమం వల్ల సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి, రాజకీయం,తదితరవన్నీ వెలుగులోకి వచ్చి సమన్యాయం జరుగుతుందని తెలిపారు.సర్వేలో నిజాయితీగా వివరాలు చెబుతూ.. అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే తప్పు చేసినట్లే అని పేర్కొన్నారు.ఈ పరిణామంతో ఇబ్బందులు పడేది కూడా వారేనని అన్నారు.ఇప్పటికే గత ప్రభుత్వం సామాజిక వనరులన్నీ దోచుకొని అన్ని వర్గాలకు అన్యాయం చేసిందని అన్నారు. దోపిడీదారులంతా దర్జాగా తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఈనెల 31 వరకు సర్వేను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.సమావేశంలో తాసిల్దార్ దయానందం,కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్,పార్టీ నాయకులు కుంచాల ప్రవీణ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.