- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల్వకుంట్ల కవితకు పదేళ్లు బీసీలు గుర్తుకు రాలేదా?
దిశ, నల్గొండ: 2014లో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా ఎంత ఉన్నదో బయట పెట్టకుండా కుట్ర పూరితంగా వ్యవహరించి నేడు బీసీలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కపట ప్రేమ చూపించడం దుర్మార్గమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గండి చెరువు వెంకన్న గౌడ్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం బీసీ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..పదేళ్లు అధికారంలో ఉన్న BRS పార్టీకి బీసీ సంఘాల నాయకులుగా ఎన్నో సార్లు ఫూలే విగ్రహం పెట్టాలని వినతి పత్రాలు ఇచ్చిన కూడా పట్టించుకోలేదన్నారు. కనీసం బీసీ సంఘాల నాయకులని కలవడానికి ఇష్టపడని కేసీఆర్… అధికారంలో ఉండి కులగణన గురించి ఏనాడు ఆలోచించని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీసీల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందన్నారు.
నేడు బీసీలకు న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతుందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానం చేయడం జరిగిందని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని, 50 శాతం రాజకీయ రిజర్వేషన్ల సీలింగ్ ని ఎత్తివేస్తామని ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రకటించారన్నారు. గత ప్రభుత్వం ఏనాడు కూడా బీసీ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేయలేదని, 33 శాతం ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించిన చరిత్ర కేసీఆర్ ది అని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో బీసీలకు అడుగడుగున అన్యాయం జరిగింది అన్నారు. కులగణన పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా దాటకముందే BRS నాయకులు విషం చిమ్ముతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు చిత్త శుద్ధి ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకి 50 శాతం స్థానాలు అంటే 9 పార్లమెంట్ స్థానాలు ఇచ్చి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేరటి మల్లేష్ యాదవ్, గిరి శివ, కత్తుల కోటి, చింతపల్లి గోపాల్,ఎలుగు పాండు ముదిరాజ్, కుడుతాల నాగరాజు నరేందర్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు