కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధుకి రాం.. రాం.. మిగిలిన పథకాలకు గుడ్ బై

by Sumithra |
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధుకి రాం.. రాం.. మిగిలిన పథకాలకు గుడ్ బై
X

దిశ, గరిడేపల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబందు కి రాం.. రాం.. మిగిలిన పథకాలకు గుడ్ బై చెబుతారని హుజూర్ నగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రాయిని గూడెం, కీతవారిగుడెం, తాళ్ళమల్కాపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే వెళ్లి ఢిల్లీలో కుర్చుకుంటాడని, నేను నియోజక వర్గంలో 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తినని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పెళ్లి అయిన ఆడబిడ్డకి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పైసలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దే అని అన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల సమయంలో కూడా ప్రచారం నిర్వహించట్లేదని, రాత్రి ఊరూరా తిరిగి ఇతర పార్టీల నాయకులను కొనడమే తన పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. నాగార్జున సాగర్ డ్యాంలో నీరు లేనప్పటికీ ఒక రైతు బిడ్డగా రైతుల బాధలను అర్థం చేసుకొని పొట్టదశకు వచ్చిన పొలాల కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒప్పించి మరీ సాగునీరు ఇప్పించానని, తనకి ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం కల్పిస్తే గోదావరి జలాలను నియోజకవర్గంలోని పంట పొలాలకు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మలి దశ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంత చారీ తల్లి శంకరమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పిడమర్తి అంజి , కీతవారి గూడెం , తాళ్ళమల్కాపురం సర్పంచు లు కీత జ్యోతి రామారావు, జ్యోతి గురవయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ సంకబుడ్డి నర్సయ్య, దాసరి శ్రీను, అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed