- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి వసూలు రాజా.. బీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్
దిశ, నకిరేకల్ : తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆర్టిఏ చట్టాన్ని ఉపయోగించి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తాడని.. అతను పెద్ద వసూల్ రాజా అంటూ బీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ కొమ్మనబోయిన సైదులు యాదవ్ విమర్శించారు. కేసీఆర్ ను విమర్శిస్తే పెద్ద నాయకుడు అవుతానని భ్రమలో స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడని మండిపడ్డాడు. నార్కెట్ పల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్గొండలో నిర్వహించిన సభ నిరుద్యోగ యువతది కాదని... కేవలం కాంగ్రెస్ నిరుద్యోగుల సభ మాత్రమేనన్నారు.
సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను చేపట్టి పేదలకు లబ్ధి చేకూరుస్తున్నారని కొనియాడారు. నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోజుకో పార్టీ పేరు మాట్లాడుతూ మతిస్థిమితం లేని వ్యక్తిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు ఏం చేశావో తెలపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి రామని భ్రమతోనే ఇష్టారిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో బింగి మహేష్, బెల్లి స్టాలిన్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.