- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి.. బీజేపీ నేత శ్రీనివాస రెడ్డి
దిశ, నేరేడుచర్ల (హుజూర్‌నగర్ ): ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని బీజేపీ సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ చాడ శ్రీనివాస్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం హుజూర్‌నగర్ పట్టణంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు బాబారెడ్డి బొబ్బ భాగ్యరెడ్డి రాష్ట్ర నాయకులు గట్టు శ్రీకాంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా ఇన్చార్జి చాడ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎన్నికలు వచ్చినప్పుడే టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కనిపిస్తారని, అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెడుతారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ నిరంకుశ, అవినీతి పాలనను అంతమొందించడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు.
పథకాల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కటేనని అన్నారు. అన్ని మండలాల బూత్ కమిటీలను వెంటనే వేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొణతం లచ్చిరెడ్డి, జిల్లా కార్యదర్శులు అన్నేపంగు అబ్బాస్, తోట శేషు, జిల్లా అధికార ప్రతినిది పత్తిపాటి విజయ్, జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు బాల్సన్ నాయక్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అంబల్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.