- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీన్మార్ మల్లన్న అరెస్ట్ అవివేకమైన చర్య.. బీజేపీ నాయకురాలు శ్రీదేవి రెడ్డి
దిశ, నల్లగొండ: తీన్మార్ మల్లన్న అరెస్ట్ అవివేకమైన చర్య అని బీజేపీ రాష్ట్ర నాయకురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనను ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం హేయమైన చర్య ఖండించారు. టీఎస్పీఎస్పీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నారనే కోపంతోనే తీన్మార్ మాల్లన్నను అరెస్ట్ చేశారని అన్నారు. టీఎస్పీఎస్పీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయిందని అన్నారు. నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న మల్లన్నను లేనిపోని కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు.
ప్రభుత్వ తీరును ప్రశ్నించడానికి ప్రయత్నించిన ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లిక్కర్ కేసు నుంచి కవితను ఎలా కాపాడుకోవాలనే ఆరాటం తప్ప ప్రజలకు గురించి పట్టించుకోవడం లేదని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.