భార్గవ్ చేరికతో కాంగ్రెస్ లో రగడ

by Disha Web Desk 11 |
భార్గవ్ చేరికతో కాంగ్రెస్ లో రగడ
X

దిశ ,మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో చేరికలు చిచ్చుపెట్టాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ అధిష్టానం పార్టీ ల చేరికలను ప్రోత్సహిస్తుంది. దీనిలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో చేరికల పట్ల అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలను పార్టీ లో చేర్చుకోవద్దని మిర్యాలగూడ నాయకులు , ప్రజాప్రతినిధులు తీర్మానాలు చేసి అధిష్టానానికి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ తిరునగర్ భార్గవ్ మరో 13 మంది కౌన్సిలర్ లతో బీఆర్ఎస్ పార్టీని వీడి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపక్ దాస్ మున్షీ సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

చేరికకు బ్రేక్ : మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ,మరికొందరి చేరిక కు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ బ్రేక్ వేశారు. పార్టీ లోని జిల్లా మంత్రులు ,స్ధానిక ఎమ్మెల్యే ,నాయకులతో చర్చించి నిర్ణయం ఉంటుందని ఒక ప్రకటన విడుదల చేశారు.దీంతో వారి చేరిక చెల్లదని ప్రకటనలో పేర్కొన్నారు .

ఫ్లెక్సీ కలకలం: బీఆర్ఎస్ లో అనేక పదవులు అనుభవించి మళ్లీ కాంగ్రెస్ లో చేరడం పై పట్టణంలో ఏర్పాటైన ఓ ఫ్లెక్సీ రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. 'ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గోడలు దూకే నాయకులారా ఖబర్ధర్ మీ పతనానికి ముందు ఉంది´ అంటూ మహిళలు పేడ కొడుతున్న ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది.అయితే ఇప్పుడు బీఆర్ ఎస్ లో ఉన్న చైర్మన్ ,కౌన్సిలర్లు గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారే కావడం విశేషం.

అభిప్రాయాలు తీసుకొవాలని స్దానికుల డిమాండ్ : బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ తిరునగర్ భార్గవ్ చేరికపై స్డానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ,డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను సంప్రదించకుండా హైదరాబాద్ లో పార్టీ లో చేరడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లోకల్ గా ఇక్కడి నాయకులు కార్యకర్తల అభిప్రాయాల మేరకు నిర్ణయాలు తీసుకోకపోతే పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని అన్నారు. మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష మేరకు చేరికను వాయిదా వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మిర్యాలగూడ నియోజకవర్గం లో చర్చనీయాంశంగా మారిన బీఆర్ఎస్ మున్సిపాలిటీ చైర్మన్ ,కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరిక ఏ విధంగా మారనుందోనని చర్చ జరుగుతుంది.



Next Story