అయ్యో...! బతుకమ్మ చీరలు ఇలా..!!

by Web Desk News |
అయ్యో...! బతుకమ్మ చీరలు ఇలా..!!
X

దిశ,తుంగతుర్తి: మగువల మనసులను దోచుకోవాల్సిన చీరలు వారి నిరాదరణకు గురవుతున్నాయి. బతుకమ్మ చీరలు అంటే మొదట్లో ఎగిరి గంతులేసే పేద ప్రజానీకం కూడా కాలానుగుణంగా వాటిపట్ల అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఉచితంగా ఇస్తున్నారు కదా...! తీసుకొచ్చి బాగుంటే కట్టుకుందాం.. ! లేకుంటే దేనికో ఒక దానికి పనికిరాకుండా పోతుందా...? అని భావిస్తున్న మహిళలు చివరికి చీరలను తీసుకొచ్చి ఏకంగా వాటితో స్నానాల గదులను ఏర్పాటు చేసుకోవడం..!ఇంటికి రక్షణగా కట్టుకోవడం.. !! తమ వ్యవసాయ భూముల్లో వేసిన పంటలకు పశు పక్షాదుల నుండి రక్షించుకోవడానికి, చంటి పిల్లలకు ఉయ్యాలలుగా.. ఇలా అనేక తరహాలలో తుంగతుర్తి మండలంలోని పలు ప్రాంతాల్లో చీరలను ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేసి పేదలకు పంపిణీ చేస్తుంటే చివరికి ఇలా వినియోగంలోకి రావడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed