అవార్డు అందుకున్న చింతపల్లి శ్రీనివాస్ గౌడ్

by S Gopi |
అవార్డు అందుకున్న చింతపల్లి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, దేవరకొండ: దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ కు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని క్రియాశీలకంగా ముందుండి పోరాడినందుకుగాను, అతని సేవలను గుర్తించిన బహుజన సాహిత్య అకాడమీ వారు తిరుపతిలో జరిగినటువంటి సౌత్ ఇండియా రైటర్స్ ఆరవ కాన్ఫరెన్స్ సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ సేవలకు గాను బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా నేషనల్ అవార్డును సాహితి అకాడమీ జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా ఆయనకు అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ జేఏసీ చైర్మన్ గా, పొలిటికల్ జేఏసీ కన్వీనర్ గా ప్రజా యుద్ధనౌక గద్దర్ తో తెలంగాణ ధూంధాం సామాజిక జాతరలో భారీ ఎత్తున 30 వేల మందితో ఉద్యమం నడిపినటువంటి నాయకుడిగా గుర్తింపుతో నేడు ఈ అవార్డు నాకు రావడం జరిగిందని ఆయన అన్నారు. అంతే కాకుండా కల్లు వృత్తిదారుల సమస్యలపై డిండి నుంచి మాల్ వరకు 100 కిలోమీటర్ల పాదయాత్ర చేసి సమస్యల సాధనకై తన వంతు కృషి చేశాను అని ఆయన తెలిపారు. అంతేకాకుండా గురుకుల పాఠశాలలలో, కళాశాలలో అనేకమంది విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత సీట్లు ఇప్పించి వారి మన్ననలను పొందానని, అవినీతి నిర్మూలనకు వ్యతిరేకంగా అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నానని, అట్టి సేవలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ వారు తనకు బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అవార్డుతో సత్కరించడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed