- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ కు వలసలు..
దిశ, మునగాల : మునగాల మండల పరిధిలోని తీమ్మారెడ్డిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ చెందిన సుమారు 20 కుటుంబాలు స్ధానిక సర్పంచ్ బూసిపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లోకి చేరారు. 100 మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను మండల కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు వైస్ ఎంపీపీ కొల్లిశెట్టి బుచ్చి పాపయ్య, ఐయన్టీయుసి కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంటు సభ్యులు యన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే యన్ పద్మావతి రెడ్డి నాయకత్వంలో పని చేయుటకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సైనికుల పనిచేయాలని కోరారు. రానున్న సాధారణ ఎన్నికలలో కోదాడ, హుజుర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు.
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఖాయమాని అన్నారు. రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బచ్చు అశోక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కాసర్ల కోటేశ్వరరావు, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు యర్రం శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అమరబోయిన మట్టయ్య,మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేనేపల్లి వీరబాబు, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి హరిబాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శామ్ సుందర్ రెడ్డి, వీరాఘవరెడ్డి వార్డు సభ్యులు అరుణ, పార్టీ లో చేరిన వారు వీరాస్వామి నవీన్, ఎర్రయ్య, కోటేష్, రాజేష్, నాగరాజు, సైదిరెడ్డి, రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.