అనంతారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రమాదం..

by Sumithra |
అనంతారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రమాదం..
X

దిశ, పెన్ పహాడ్ : మండల పరిధిలో అనంతారం పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో కూలీ, హమాలీ కార్మికులకు గాయాలైన సంఘటన బుధవారం అనంతారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో చోటుచేసుకుంది. హమాలీ కూలీలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు లారీకి ఎగుమతి చేస్తుండగా ప్రమాదవశాత్తు కూలి, హమాలీ కార్మికులకు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో భీమ్ పని వెంకన్న, ఉప్పరి వెంకన్న, మామిడి వెంకన్న, సుందరయ్యలకు గాయాలు కాగా 108 ద్వారా సూర్యపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలాన్ని, తహసీల్దార్ శేషగిరిరావు పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed