- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Collector Tejas Nand Lal Pawar : తొలిమెట్టులోనే లక్ష్యాన్ని ఎంచుకోవాలి..
దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : జీవితానికి తొలిమెట్టు పదవ తరగతి నుండి మొదలవుతుందని జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని దానికనుగుణంగా నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. బుధవారం సాయంత్రం సూర్యాపేట పట్టణంలోని గిరినగర్ లో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, హనుమాన్ నగర్లో గల గవర్నమెంట్ హైస్కూల్ కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా గిరినగర్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఓపీ రిజిస్టర్ను పరిశీలించి, వచ్చిన ప్రతి పేషెంట్ కి అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారా సుష్మాను అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ చాంపిల్స్ అన్నింటిని టీ హబ్ కు రెగ్యులర్గా పంపుతున్నారా రిజిస్టర్ లో నమోదు చేస్తున్నారా అని పరిశీలించారు. డెంగ్యూ , మలేరియా కేసుల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఇమినైజేషన్ చేస్తున్న తీరును ఏఎన్ఎం సువర్ణను అడిగారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చేరోగులను జాగ్రత్తగా పరిశీలించి మందులు అందజేయాలని తెలిపారు. అక్కడ నుండి హనుమాన్ నగర్ లో గల గవర్నమెంట్ హై స్కూల్ ను సందర్శించారు. స్టాఫ్ రూమ్ లో గల అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించి పాఠశాలలోని అన్ని గదులను పరిశీలించారు. 9వ తరగతిలో జరుగుతున్న డ్రాయింగ్ క్లాసులు నందు కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు. క్లాసులో ఉన్న డ్రాయింగ్ టీచర్ సత్యంను డ్రాయింగ్ లో మెలకువలను పిల్లలకు నేర్పాలని తెలిపారు. అక్కడ నుండి 10వ తరగతి గదిని పరిశీలించారు. విద్యార్థులతో కలెక్టర్ బాగా చదివి అందరూ 10/10 పొందాలని డిక్టేషన్ మార్కులు సాధించాలని కలెక్టర్ సూచించారు.
పదవ తరగతి నుండే జీవితానికి తొలిమెట్టు మొదలవుతుందని ఇక్కడే జీవిత లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఏమి కావాలి, భయం లేకుండా, అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉండాలని, ఈ మూడింటితో ఏదైనా సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. పదవ తరగతి విద్యార్థులకు నాలెడ్జ్, నైపుణ్యం, పర్సనాలిటీ పై కలెక్టర్ వివరించారు. ఆటలు, స్నేహితులు ఉండాలి కానీ దేనికి ఇచ్చే సమయం దానికి ఇచ్చి చదువు పై శ్రద్ధ వహించాలని జిల్లాకు మంచి పేరు తేవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ప్రధానోపాధ్యాయులు వై.ఎథిపతి రావు, టీచర్ ఎండీ గౌస్, మెడికల్ ఆఫీసర్ శివప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్ సుష్మ, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.