Rare Incident : మంగళవారం కీడు.. పట్టణాలకు పాకిన మూఢనమ్మకాలు..

by Sumithra |   ( Updated:2024-10-28 05:46:20.0  )
Rare Incident : మంగళవారం కీడు.. పట్టణాలకు పాకిన మూఢనమ్మకాలు..
X

దిశ, సూర్యాపేట టౌన్ : మన దేశంలో ఎన్నో మూఢనమ్మకాలు -దురాచారాలున్నాయి. ఆడపిల్లలకు పది సంవత్సరాల వయసు దాటకుండానే బాల్య వివాహాలు చేసేవారు. హేతుబద్దమైన మంచి నమ్మకాల వల్ల సదాచారాలు పుడతాయి. సతీసహగమనం, బాణామతి, అంటరానితనం... ఇవన్నీ మూఢనమ్మకాల వల్ల పుట్టిన దురాచారాలే. అక్కడక్కడా ఈనాటికీ కనబడుతున్న కొన్ని మూఢనమ్మకాలు - దురాచారాలు ఉన్నాయి. ఈ మూఢనమ్మకాలు పల్లెలో నుంచి పట్టణంలోకి ప్రవేశించాయి.

తాజాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో ప్రతి మంగళవారం ఒకరు చనిపోతున్నారని, కీడు సోకిందని భావిస్తూ ఓ వార్డు ప్రజలు ఆదివారం వనభోజనాలకు వెళ్లారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు సూర్యాపేట జిల్లా ( Suryapet District ) కేంద్రంలోని 30 వార్డు (జమ్మిగడ్డ)లో నెల రోజుల వ్యవధిలో ఆరుగురు వ్యక్తులు వివిధ కారణాలతో మృతి చెందారు. వీరంతా మంగళవారం రోజే చనిపోవడంతో కాలనీ వాసులు తెలిసిన పండితుల సలహా తీసుకున్నారు. వార్డుకు కీడు సోకిందని వార్డు ప్రజలంతా ఇంటికి తాళం వేసి ఒక రోజు వనభోజనాలకు ( food ) వెళ్లాలని చెప్పారు. దీంతో వార్డు ప్రజలు ఆదివారం వనబోజనాలకు వెళ్లారు. 20వ వార్డు జమ్మిగడ్డలో సూమారు 1500 కుటుంబాలు ఉండగా, అందులో 800 కుటుంబాలకు పైగా సభ్యులు ఉదయం 10.30 గంటలకు ఇళ్లకు తాళం వేసి సూర్యాపేట శివారులోని దురాజ్ పల్లి గుట్టకు వనభోజనాలకు వెళ్లారు. అక్కడే వంటలు చేసుకుని భుజించి సాయంత్రం ఐదు గంటలకు తిరిగి వచ్చారు.

వనభోజనాలకు వెళ్తే మరణాలు ఆగాయి... 30 వార్డు కౌన్సిలర్ అన్నెపర్తి రాజేష్...

కొన్ని నెలలుగా ప్రతి మంగళవారం ఒకరు మృతి చెందుతున్నారని తెలిపారు. వనభోజనాలకు వెళితే మరణాలు ఆగుతాయన్న నమ్మకంతో ప్రజలంతా కలిసికట్టుగా ఇప్పుడు కూడా వనభోజనాలకు వెళ్లమన్నారు. వార్డు ప్రజలు తరళడంతో ఆదివారం వార్డులోని పలు వీధులు నిర్మానుష్యంగా మారాయి.

Advertisement

Next Story

Most Viewed