- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రమాదవశాత్తు సద్దల చెరువులో పడి యువకుడు మృతి
by samatah |

X
దిశ,ప్రతినిధి సూర్యా పేట : సద్దల చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రం లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం ఎల్కారం గ్రామానికి చెందిన బొర్రా లింగస్వామి(27) వివాహాలకు బ్యాండ్ వాయిస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం సద్దాల చెరువు పక్కన ఉన్న ఒక శుభకార్యంలో బ్యాండ్ వాయించడానికి వచ్చాడు.కాలకృత్యాలు తీర్చుచ్చుకోవడానికి సద్దల చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు,ఫైర్ సిబ్బంది హుటాహుట్టిన చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి మృతిదేహం బయటికి తీశారు.
- Tags
- pond
- person died
Next Story