మద్యం మత్తులో భార్యను చంపేసిన భర్త

by Naveena |
మద్యం మత్తులో భార్యను చంపేసిన భర్త
X

దిశ అడ్డగూడూరు : మద్యం మత్తులో భార్యను ఓ భర్త చంపేశాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని డిరేపాక గ్రామంలో చోటు చేసుకుంది. అడ్డగూడూరు ఎస్సై డి నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..మృతురాలు తండ్రి సంగు రాజిరెడ్డిS/o మల్లారెడ్డి అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. రేపాక గ్రామానికి చెందిన బొనిగే కృష్ణారెడ్డి తో బోనిగే స్వరూప కు 30 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. కృష్ణారెడ్డి మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. నిన్న ఉదయం భార్యతో గొడవ పడి బయటికి వెళ్లి మద్యం సేవించి మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చాడు. అనంతరం మద్యం మత్తులో భార్యను చీరతో మెడకు ఉరివేసి హత్య చేశాడని తెలిపారు. మృతురాలి తండ్రి సంగు రాజి రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి నాగరాజు తెలిపారు.

Advertisement

Next Story